టీ అంటే ఇష్టపడని వారెవరు ఉండరు. సమయంతో సంబంధం లేకుండా.. రోజులో నాలుగైదు సార్లు టీ తాగేస్తుంటారు.
అయితే.. సాయంత్రం వేళ టీ తాగడం వల్ల, కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యం నిపుణులు చెప్తున్నారు.
నిద్రపోవడానికి 10 గంటల ముందు కెఫిన్ తీసుకోకూడదు. ఇలా చేస్తే.. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది, కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.
ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు.. సాయంత్రం టీ తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
బరువు తక్కువగా ఉన్నవారు, జుట్టు, చర్మం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.
రోజులో 4 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగితే.. ఇందులో ఉండే టానిన్ శరీరంలో ఐరన్ శోషణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
శాఖాహారులు టీకి కొంచెం దూరంగా ఉంటే బెటర్. లేకపోతే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
సాయంత్రం మోతాదుకి మించి టీ తాగితే.. డిహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి, ఎముకలు బలహీనపడతాయి.
టీలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
రోజులో 5 నుంచి 10 కప్పుల టీ తాగితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది.