ఈ భూమ్మీద మనిషి ప్రాణంతో సహా ఏది శాశ్వతం కాదు.. సమస్త జీవరాశులూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే.

ఈ భూమ్మీద మనిషి ప్రాణంతో సహా ఏది శాశ్వతం కాదు.. సమస్త జీవరాశులూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే.

వ్యక్తి మరణానంతరం వారి జ్ఞాపకాలతోపాటు వారికి సంబంధించిన వస్తువులూ మనతో ఉంటాయి. మరి, వాటిని ఏం చేయాలి? ఇతరులు ఉపయోగించాలా? వద్దా?

చనిపోయిన వ్యక్తి ఆభరణాలను ఇతరులు ధరించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

నగలను స్మారక చిహ్నాలుగా లేదా సెంటిమెంట్ కోసం ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. అలా కాకుండా వాటిని ధరించడం వల్ల.. మరణించిన వ్యక్తి ఆత్మను ఆకర్షించినట్లు అవుతుందట. 

ఒకవేళ మరణానికి ముందు వారి ఆభరణాలను మీకు బహుమతిగా ఇచ్చి ఉంటే, వాటిని ధరించవచ్చని చెబుతున్నారు.

మరణించిన తర్వాత ఆభరణాలు అందితే.. వాటిని కరిగించి కొత్త డిజైన్‌ చేయించిన తర్వాత ధరించవచ్చని చెబుతున్నారు.

చనిపోయిన వారి వస్త్రాలను గుర్తుగా తమ వద్ద ఉంచుకుంటారు కొందరు. వాటిని ధరించి వారు తమతోపాటే ఉన్నట్టు భావిస్తారు.

వాస్తు ప్రకారం పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించకూడదని అంటున్నారు.

ఎందుకంటే ఆ బట్టలు వారి ఆత్మలను ఆకర్షిస్తాయని.. ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తులను కుటుంబ సభ్యులు ధరిస్తే అది చెడు ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు.

చనిపోయిన వారి వస్త్రాలను ధరిస్తే.. చనిపోయిన వ్యక్తి ఆత్మ అనుబంధాల బంధాలను తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుందని తెలుపుతున్నారు. 

పొరపాటున కూడా మరణించిన వ్యక్తి వాచ్‌ను ఇతరులు ధరించకూడదట. దువ్వెన, షేవింగ్ కిట్‌, రోజువారీ వస్తువులు కూడా దానం చేయడం లేదా నాశనం చేయడం మంచిది.

చనిపోయిన వారి వస్తువులు వాడటం వలన  పితృ దోషానికి కారణం కావచ్చంట. అందుకే మృతి చెందిన వారి వస్తువులు వాడేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలని పురాణాలు చెబుతున్నాయి.