ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ అత్యంత ఉత్కంఠగా సాగుతోంది.
ప్రస్తుత ప్రపంచకప్‌లో అనేక సంచలనాలు నమోదయ్యాయి.
గతంలో ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన జట్లకు చిన్న జట్లు షాకిచ్చాయి.
క్వాలిఫయర్స్ దశలో శ్రీలంకను నమీబియా ఓడించింది.
క్వాలిఫయర్స్ దశలో వెస్టిండీస్‌ను స్కాట్లాండ్, ఐర్లాండ్ వంటి పసికూనలు ఓడించాయి
రెండు సార్లు కప్ కొట్టిన వెస్టిండీస్ సూపర్-12కు కూడా రాలేదు.
గ్రూప్-1లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించి షాక్ ఇచ్చింది.
సూపర్-12 దశలో పాకిస్థాన్ లాంటి పటిష్ట జట్టును జింబాబ్వే ఓడించింది.
సెమీస్ బెర్త్ ఖరారు అని భావించిన దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది.
సంచలనాల కారణంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు రాకుండానే ఇంటిదారి పట్టాయి.