కోపం వస్తే చాలా మంది గట్టిగా అరిచేస్తారు.. అది చాలా మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. 

ముఖ్యంగా అమ్మాయిలు ఎంత గట్టిగా అరిస్తే అంత త్వరగా చల్లబడతారట.

అప్పుడప్పుడు అరచి కేకలు వేయడం వల్ల లోపల దాగి ఉన్న కోపం బయటకు వెళ్లిపోతుందట. 

 కోపం బయటకు వెల్లగక్కడం వల్ల కూడా ఎండార్ఫిన్స్ విడుదలవుతాయట. ఎండార్ఫిన్లకు హ్యాపీ హార్మోన్లని పేరు. 

మామూలుగా ఎండార్ఫిన్లు సంతోషంగా ఉన్నపుడు, వ్యాయామం తర్వాత విడుదలవుతాయి.

అలాగే కోపంతో అరిచినపుడు కూడా శరీరంలో ఇలాంటి ప్రతిచర్యలే జరుగుతాయి. 

అయితే ఈ స్క్రీమింగ్ థెరపీ పాతవిషయమే అని ప్రముఖ శాస్త్రజ్ఞులు అంటున్నారు. 

గట్టిగా అరవడం వల్ల శారీరక బలం పెరుగుతుందని అయోవా స్టేట్ యూనివర్సిటీ నిపుణులు కూడా అంటున్నారు.

అయితే ఇది మహిళలకు మరీ మంచి థెరపి అంటున్నారు. 

చైనాలో ఈ స్క్రీమింగ్ చాలా ప్రాక్టీస్‌లో ఉందట. 

గట్టిగా అరవడం కూడా ఒత్తిడిని జయించే మరోమార్గం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.