సాధారణంగా వైద్య ప్రయోగాలు ఎలుకలపై ఎక్కువగా చేస్తారు..

కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త లెస్లీ లీన్‌వాండ్‌ మాత్రం రెండు దశాబ్దాలుగా పాములపై అధ్యయనం..

మనుషుల గుండెలకు ప్రమాదకరంగా మారే వాటి నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు పైథాన్‌లకు ఉన్నట్టు వెల్లడి

ఒక పైథాన్‌కు 28 రోజులు ఆహారం ఇవ్వకుండా.. తర్వాత దాని శరీర బరువులో పావు వంతు ఆహారాన్ని అందజేత..

కార్డియాక్‌ ఫైబ్రోసిస్‌ లాంటి గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చు: శాస్త్రవేత్తలు

ఇలా ఆహారాన్ని ఇచ్చినప్పుడు మిగతా పాముల కంటే ఈ పైథాన్‌ శరీరంలో అనేక మార్పులను గుర్తించిన శాస్త్రవేత్తలు

గుండె కణజాలం సైతం మృదువుగా మారిందని, పల్స్‌ రెట్టింపు అయ్యింది: శాస్త్రవేత్తలు

ఆహారం పూర్తిగా జీర్ణమైన రెండు వారాల తర్వాత పాములోని గుండె మాత్రం కొంత పెద్దగా, బలంగా మారింది: శాస్త్రవేత్తలు