తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు సంయుక్త మీనన్.

పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమాద్వారా తెలుగుతెరకు పరిచయమైంది. 

 ఆ సినిమా నుంచి సంయుక్తకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

భీమ్లానాయక్ తర్వాత కల్యాణ్ రామ్ సరసన బింబిసారా, ధనుష్ తొలి తెలుగు చిత్రం సార్ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. 

సాయిధరమ్ తేజ్ తో నటించిన విరూపాక్ష సినిమాలో తన నటనలోని రౌద్రరసాన్ని పరిచయం చేసింది.

తాజాగా ఈమె నిఖిల్ హీరోగా వస్తున్న స్వయంభూ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమానే కాకుండా సంయుక్త చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి.