టాలీవుడ్ నటి సమంత, నిర్మాత-దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1, 2025 సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో వివాహం చేసుకున్నారు.

వివాహం లింగ భైరవి దేవి సన్నిధిలో, అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం “భూత శుద్ధి వివాహం” రూపంలో జరిగింది.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే ఈ సాదాసీదా, పవిత్ర వేడుక నిర్వహించారు.

ఈశా ఫౌండేషన్ అధికారికంగా సమంత-రాజ్ జంటకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

 లింగ భైరవి దేవి అనుగ్రహం వారి జీవితాన్ని ఆనందమయం చేయాలని కోరింది.