దక్షణాది కథానాయికల్లో అందమైన ముద్దుగుమ్మ ఎవరు అంటూ అన్ని భాషల సినీ ప్రేమికులు ఠక్కున చెప్పే పేరు సమంత.

 మయోసైటిస్ వ్యాధి సోకడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు విరామం ప్రకటించింది. 

ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో ఓ సినిమా, ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

 నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత హఠాత్తుగా విడిపోతున్నామని తెలిపేసరికి సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. 

పరిశ్రమలో మంచి జంటగా, ముచ్చటైన జంటగా పేరుతచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను, తనకు సంబంధించిన వివరాలను పంచుకుంటుంది.

తాజాగా జీరో సైజులో కనిపించి షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ అందాలకు ఫిదా అయిపోతున్నారు.