ఈ విశ్వం అనేక రహస్యాలకు నిలయం.
అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకడంలేదు. అలాంటి వాటిల్లో ఒకటి.. కదిలే రాళ్ళు.
రాళ్లు నడవటం ఎక్కడైనా చూశారా? వాటిని చూడాలంటే మాత్రం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి వెళ్లాల్సిందే.
అక్కడ ఎండిపోయిన ఓ సరస్సులో రాళ్లు వాటికవే కదులుతాయి.
ప్రాణంలేని రాళ్లు ఎలా కదులుతాయనే ప్రశ్న చాలామందిలో మొదలవుతుంది.
దీనిపై చాలామంది పరిశోధనలు జరిపారు. సుమారు 319 కిలోల బరువుండే రాళ్లు ఎవరి ప్రమేయం లేకుండా వాటికవే కదలడం మిస్టరీగా మారింది.
ఎవరైనా మనుష్యులు ఈ రాళ్లను కదుపుతున్నారా అనే దానికి ఆనవాళ్లు ఎక్కడా కనపడవు.
ఎవరూ చూడని సమయంలోనే ఈ రాళ్లు కదులుతాయని చాలామంది బలంగా నమ్ముతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కదిలే రాళ్లన్ని కూడా ఒకే దిశలో కదలవు. ఇది నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి.
గాలి, ఉష్ణోగ్రతల కారణంగానే ఇలా జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.