సాయి పల్లవికి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. త్వరలో ఆమె చెల్లెలు ప్రియుడిని వివాహం చేసుకోనుంది.

సాయి పల్లవి చెల్లెలు ప్రియుడిని పరిచయం చేసింది. నా లైఫ్ పార్ట్నర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. 

ఈ మూవీ కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. మళ్ళీ పూజ కన్నన్ నటించలేదు. ఆమె సోషల్ వర్కర్ అని సమాచారం. 

తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి మేటర్ లీక్ చేసింది. ప్రియుడిని పరిచయం చేసింది. 

ఇతని పేరు వినీత్, నా ఆశాకిరణం. నా క్రైమ్ పార్ట్నర్, ఇప్పుడు పార్ట్నర్ అని రాసుకొచ్చింది.

అయితే సాయి పల్లవి పెళ్లిపై ఇంకా రెడీ లేదని తెలుస్తుంది. ఎందుకంటే సాయి పల్లవి వరుస చిత్రాలతో బిజీగా ఉంది. 

తెలుగులో సాయి పల్లవి, నాగ చైతన్యకు జంటగా తండేల్ అనే మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఇది ఎమోషనల్ లవ్ డ్రామా అని సమాచారం. నాగ చైతన్య జాలరి రోల్ చేస్తున్నాడు. 

గతంలో సాయి పల్లవి-నాగ చైతన్య కాంబోలో విడుదలైన లవ్ స్టోరీ విజయం సాధించింది.