నాచురల్ నటనకు కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి. వెండితెరపై తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ద్వారానే ప్రేక్షకులను మెప్పిస్తోంది సాయి పల్లవి

టాలీవుడ్ యంగ్ హీరో రానాతో కలిసి సాయి పల్లవి విరాట పర్వం, ఆ తర్వాత లేడీ ఒరియెంటేడ్ మూవీ గార్గిలో కూడా నటించింది.

ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పటివరకు సాయి పల్లవి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరిస్తుందని సమచారం.

జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన సాయిపల్లవి,తాను అభ్యసించిన వైద్య వృత్తికి న్యాయం చేయాలని అనుకుంటుందని తెలుస్తుంది.

కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని.. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని సమాచారం.

ఆస్పత్రి నిర్మించి ఇకపై వైద్య వృత్తినే కొనసాగించాలని, వదిలేయాలని కూడా అనుకుంటున్నట్టుగా టాక్‌

మరి ఈ వార్తలపై  సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి