తెలుగు హీరోయిన్ రీతూ వర్మ తాజాగా తన బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకొని ఆకట్టుకుంది.

రీతూ వర్మ ముందుగా  ‘బాద్షా’ చిత్రంతో వెండితెరపై మెరిసి కాజల్ కు చెల్లిలిగా పింకీ పాత్రలో నటించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత నుంచి హీరోయిన్ గా మారిన ఆమె ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’, ‘కేశవ’ వంటి చిత్రాలతో అలరించింది.

పెళ్లి చూపులు మూవీతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తూ తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటోంది.

Fill in some text

తాజాగా స్లీవ్ లెస్ టాప్, బ్లాక్ ట్రౌజర్ క్యాజువల్ వేర్ లో రీతూ వర్మ ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో మెరిసినా తన స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తోంది.

తాజాగా రీతూ వర్మ పంచుకున్న ఫొటోలలో పెద్దగా గ్లామర్ షో లేకున్నా హీటు పెంచేలా ఉండటం గమనార్హం.