నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల ఆనారోగ్యం కలగవచ్చు. అందుకే మంచి నీరు తాగే సరైన విధానం ఏంటో తెలుసుకుందాం.

పరుగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం మిన్న అన్నారు పెద్దలు. మరి నిలబడి నీళ్లు తాగడం గురించి ఆయుర్వేదం ఏమంటోంది.

మనిషి శరీరానికి మంచి నీరు చాలా అవసరం. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండటానికి నీరు అత్యంత ప్రధానం. 

చాలా మందికి మంచినీరు తాగే సరైన విధానం తెలియదు. అందుకే తప్పు విధానంలో తాగేస్తుంటారు. అది శరీరానికే ప్రమాదం. ఈ చిట్కాలు మీరు మీ జీవన విధానంలో పాటిస్తే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 

నీటిని తాగడానికి గ్లాసును వినియోగించండి.. బాటిల్ కాదు. అనారోగ్యం ఉంటే ఎక్కువ నీరు తీసుకోండి.

ఉదయం నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభం చేకూరుతుంది.

భోజనం చేయడానికి అరగంట ముందు నీళ్లు తాగండి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. 

నిద్రకు ఉపక్రమించడానికి ముందు నీళ్లు తాగండి. దీని వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

వ్యాయామానికి ముందు.. వ్యాయామం తరువాత గ్లాసు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది.