టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లాలో కొండారెడ్డి పల్లి, వంగూర్‌లో నవంబర్ 08, 1969న జన్మించారు
మహబూబ్‌నగర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్ననాటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవారు
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి మేనకోడలు గీతాను వివాహమాడారు
రెండు అసెంబ్లీ ఎన్నికలలో వేర్వేరు అఫిడవిట్ల కారణంగా రేవంత్ రెడ్డి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు
శూలశోధన ఆపరేషన్‌లో దొరికినందుకు గానూ అవినీతి వ్యతిరేకం విభాగం పోలీసులు 2015 మేలో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
2017 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు
2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్ నుంచి పోటీ చేశారు
2018 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఆయన నియమితులయ్యారు
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు
2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు
రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది
2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు
2023 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు
ఇక అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయి