చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అయితే.. అది ఏమాత్రం సరికాదు. గుడ్డును ఉడికించి తినటమే మంచిది. 

తెల్లసొనలో ఎవిడిన్‌ అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. ఇది బయోటిన్‌తో కలిసిపోయి, శరీరం వినియోగించుకోకుండా అడ్డు పడుతుంది. 

అదే గుడ్డును వేడి చేసి తీసుకుంటే మాత్రం.. అది బయోటిన్ నుంచి విడిపోతుంది. అప్పుడు ఆ పోషకాహార నిరోధకం శరీరానికి అందుతుంది.

గుడ్డులో ట్రిప్సిన్‌ అనే ఎంజైమ్‌ను పనిచేయకుండా చూసే నిరోధకం కూడా ఉంటుంది. వేడి చేసినప్పుడు అది నిర్వీర్యం అవుతుంది

చాలామంది పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుందని, దాన్ని తీసేసి తెల్లసొన మాత్రమే తింటారు. 

గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉండే మాట నిజమే కానీ.. ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే మాత్రం, గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ చాలా తక్కువ.

కొలెస్ట్రాల్‌ను నేరుగా రక్తంలో కలవకుండా చూసే లెసిథిన్‌ వంటి రసాయనాలు గుడ్డులో ఉంటాయి. కాబట్టి.. గుడ్డుతో సమస్య ఉండదు.

గుడ్డు తెల్లసొనలోని ప్రోటీన్‌ నెమ్మదిగా జీర్ణమవుతుంది. త్వరగా ఆకలి వేయదు. కాబట్టి ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది.

విటమిన్‌-సి, పీచు పదార్థం తప్పించి.. గుడ్డులో మిగతా పోషకాలూ, విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయింటాయి. అందుకే.. గుడ్డు ప్రత్యేకమైన ఆహారం!