స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
గుండెపోటు, నరాల బలహీనత, సంతాన సమస్యలు ఏర్పడుతాయి.
స్మోకింగ్ మానేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
20 నిమిషాల-12 గంటల తర్వాత: హార్ట్ రేటు, రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ సాధారణ స్థాయికి పడిపోతాయి.
1 సంవత్సరం తర్వాత: గుండెపోటు ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది, బీపీ, దగ్గు , శ్వాసకోశ సమస్యలు మెరుగుపడతాయి.
2-5 సంవత్సరాల తర్వాత: స్మోక్ చేయని వ్యక్తికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
5-15 సంవత్సరాల తర్వాత: నోరు, గొంతు, అన్నవాహిక, మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం సగానికి తగ్గుతుంది.
10 సంవత్సరాల తర్వాత: ఊపిరితిత్తులు, మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ప్రస్తుతం స్మోకింగ్ చేసేవారితో పోలిస్తే సగానికి తగ్గుతుంది.
15 సంవత్సరాల తర్వాత: గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎప్పుడూ స్మోకింగ్ చేయని వ్యక్తికి సమానంగా ఉంటుంది.