అందంగా ఉంటే చాలు అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతారు అనే భ్రమలో ఉంటారు చాలా మంది అబ్బాయిలు. కానీ, ఈ భావన తప్పని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 

అమ్మాయిలు అబ్బాయిల్లో కేవలం అందం, శృంగార పరమైన లక్షణాలను చూసే ఆకర్షితులు కారని, వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు లేదా అభిరుచులను కూడా చూస్తారట.

ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆకర్షనీయంగా ఉండే పురుషులు స్త్రీలను ఇట్టే ఆకట్టుకుంటారట. 

ఆత్మవిశ్వాసంతో మానసికంగా, దృఢంగా ఉండే పురుషులంటే స్త్రీలకు ఎనలేని ఇష్టమట. నమ్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండే పురుషులు స్త్రీలను ఇట్టే ఆకట్టుకుంటారట.

స్త్రీలకు బాగా వంట చేసిపెట్టే పురుషులంటే చాలా ఇష్టమట. వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వంటకాన్ని తయారు చేస్తే చాలు స్త్రీలు ఇట్టే పడిపోతారట.

ఫ్యాషన్‌వేర్ ధరించే పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టమట. ఆకర్షనీయమైన దుస్తుల్లో తయారయ్యే పురుషుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని స్త్రీలు నమ్ముతారట. 

మూస ధోరణిలో ఆలోచించే పురుషుల కంటే తెలివిగా ఆలోచించే వారు, ఇతర యాక్టివిటీస్ కలిగి ఉండేవారంటే స్త్రీలకు ఇష్టమట. 

స్త్రీలకు చలాకీగా మాట్లాడే పురుషులంటే ఎక్కువ ఇష్టమట. ఎప్పుడు నీరసంగా, ఒంటరిగా, దిగాలుగా ఉండే పురుషులకు దూరంగా ఉండాలని వారు కోరుకుంటారట. 

తమకు నచ్చిన విషయాల గురించి, పురుషులు చర్చిస్తే మహిళలు ఇష్టపడతారట.