టీ అంటే చాలా మందికి ఇష్టం. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.

టీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో అల్లం టీ కూడా ఒకటి. అల్లంలో టీలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

ప్రతి రోజూ రెండు సార్లు చిన్న అల్లం టీ కప్పుతో టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

2 లేదా 3 గ్లాసులకు మించి అల్లం టీని తాగితే మాత్రం సమస్యలు తప్పవు.

వర్షా కాలంల, చలి కాలంలో తప్పించి.. వేసవి కాలంలో అల్లం టీ తాగకూడదు.

అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ సమస్య పెరుగుతుంది.

రోజుకు రెండు కప్పులకు మించి తాగితే.. జీర్ణ సమస్యలు కూడా పెరుగుతాయి.

అల్లం టీ ఎక్కువగా తాగితే రక్తాన్ని చాలా పలుచగా చేస్తుంది.

బీపీ తక్కువగా ఉంటే.. అల్లం టీ తాగకపోవడమే శ్రేయస్కరం.