తల్లి కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.
కొంతమంది 35 వయస్సులోగా గర్భం దాల్చితే, మరికొంతమంది ఆ వయస్సు తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు.
35 సంవత్సరాల తర్వాత గర్భం రావాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
ఇలా 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీని
'ట్రిక్ ప్రెగ్నెన్సీ' అంటారు.
ఈ మధ్యకాలంలో ఉద్యోగం, సంపాదన మోజుతో కొంతమంది మహిళలు పిల్లలను కనడానికి ఆలస్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇలా 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీని
'ట్రిక్ ప్రెగ్నెన్సీ' అంటారు.
ఈ వయస్సులో గర్భం దాల్చితే అది భాగస్వాములిద్దరికి సంతోషమైన విషయమే కావచ్చు కానీ, ఈ టైంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
లేట్ ప్రెగ్నన్సీతో పుట్టే బిడ్డ.. తక్కువ బరువుగా ఉండటం లేదా శారీరక లోపాలు గైనకాలజిస్ట్లు చెబుతున్నారు.
లేటు వయస్సులో గర్భం దాల్చిన వారు తప్పనిసరిగా మొదటి నెల నుంచే డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి.
కొంతమందిలో నెలలు పూర్తి కాకుండానే బిడ్డ జన్మించటానికి అవకాశం ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ శారీరక సామర్ధ్యం తగ్గుతుంది.
సరైన ఆహారం అంటే పాలు, గుడ్లు, మాంసం, చేపలు, తృణధాన్యాలు, బ్రకోలి వంటి ఆహారం తీసుకోవాలి.
అలాగే పోలిక్ యాసిడ్ విటమిన్స్, క్యాప్సిల్స్ డాక్టర్ సూచనతో వాడాలి. ప్రతిరోజూ 600 గ్రాముల పోలిక్ యాసిడ్ తీసుకోవడం మంచిది.
ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక, ప్రతిరోజూ ఓ అరగంట వాకింగ్ చేయాలి. మద్యం, సిగరెట్ వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలి.
లేటు వయసులో గర్భం దాల్చటం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి 35 ఏళ్ల ముందే పిల్లల గురించి ప్లాన్ చేసుకోవడం మంచిది.
కొంతమంది 35 వయస్సులోగా గర్భం దాల్చితే, మరికొంతమంది ఆ వయస్సు తర్వాత ప్రెగ్నెంట్ అవుతారు.