అందరూ ఇష్టంగా జరుపుకునే దీపావళి రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం ఇంకా వెలుగుమయమవుతుంది.

ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలంటే.. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

ముందుగా.. టపాసులు పేల్చేసమయంలో చేతికి శానిటైజర్లు రాసుకోకూడదు.

పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు.

బాణాసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించొద్దు.

బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.

 జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం.

గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.

బాణాసంచాను పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు చదవండి.

మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రాంతాలకు, ద్రావణాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి.

టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా బక్కెట్‌తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.

బాణాసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసులకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి.