మండపాలకు కర్రలు, ఇనుప పైప్‌లు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. 

 ట్రాఫిక్‌క అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలు పెట్టొద్దు.  

  మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడదీస్తుంటారు. 

విద్యుత్‌ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడుతుంది. వదులుగా ఉన్న వైర్లు గాలి, వానకు కింద పడి విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తాయి. 

 ఇలా కాకుండా అధికారిక కనెక్షన్‌ తీసుకోవడం ద్వారా విద్యుత్‌ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్‌ను ఇస్తారు. 

 హారతి, లైటింగ్ ల్యాంప్స్, విద్యుత్ ఉపకరణాల కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి.

 విద్యుత్ ట్రాన్ఫార్మర్ల వద్ద మండపాలు ఏర్పాటు అంత శ్రేయస్కారం కాదు.

రాత్రి వేళల్లో మండపాల వద్ద పెద్ద పెద్ద శబ్దాలతో మ్యూజిక్, డిజేలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.

 పెద్ద మండపాల ఏర్పాటు గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడం మంచింది.