ఎండల తీవ్రత ప్రారంభం అయింది. మార్చి నుంచి మే వరకు వడగాలుల ప్రభావం ఉంటుంది.

భారీ ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 

ముఖ్యంగా హై ప్రొటీన్ ఫుడ్, కాఫీ, టీలకు దూరంగా ఉండాలి..

ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవాలి. 

నిమ్మరసం.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

మజ్జిగ.. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. శరీరంలోని ద్రవాలను బ్యాలెన్స్ చేస్తుంది.

దోసకాయలు.. వేసవిలో దోస కాయలు, పుదీనా వాటర్ డీహైడ్రేషన్‌ను అరికడుతాయి.

కొబ్బరి నీరు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి కొబ్బరి నీరు సాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరానికి శక్తిని ఇస్తాయి.

వెజిటెబుల్స్ జ్యూస్ వేసవిలో వెజిటెబుల్స్ జ్యూస్ తీసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లను అందిస్తుంది.