డయాబెటిస్ వచ్చే ముందు మనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

ఈ మార్పులు కనిపించే దశనే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు.

చర్మంపై మచ్చలు వస్తాయి. కొంత మందిలో షుగర్‌ సమస్య వచ్చే ముందు చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి.

అలా మచ్చలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించాలి.

తరచూ మూత్ర విసర్జన అవుతుంది. షుగర్‌ లెవల్స్‌ అదుపులో లేకపోతే మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది.

కొందరిలో తీవ్ర తలనొప్పి, మరికొందరిలో చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టడం, ఇంకొందరిలో అరికాళ్లలో మంటలు పుట్టడం లాంటి లక్షణాలు.

 కొంతమంది నోరు ఎండుకపోయి నాలుక తడారినట్లు అనిపిస్తుంది.

ఉన్నట్టుండి జట్టు రాలే సమస్య ఎక్కువైందంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

 ప్రీ డయాబెటిక్‌ స్టేజ్‌లో ఏ పని చేయకపోయినా రోజంతా అలసటగా ఉంటుంది.