చిన్ననాటి నుంచే సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్న పూజా హెగ్డే కాలేజీ రోజుల నుంచి నటన విషయంలో స్పెషల్ కేర్ చూపించింది.

ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే కాలేజీ రోజుల్లోనే నటన మీద ఇంట్రెస్ట్ తో పలు సినిమా ఆడిషన్స్ లో పాల్గొంది.

తర్వాత మోడలింగ్ చేయడం మొదలుపెట్టిన ఆమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా లాంచ్ కూడా అయిపోయింది.

తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది.

ఆ తర్వాత ఆమె తెలుగులో ముకుందా సినిమా సహా హిందీలో మొహంజదారో అనే సినిమాలో నటించింది కానీ అవి రెండూ ఆమెకు వర్కౌట్ అవ్వలేదు.

దువ్వాడ జగన్నాథం సినిమాతో కొంత క్రేజ్ సంపాదించిన ఆమె రంగస్థలం సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది.

అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో మొదటి హిట్ అందుకున్న ఆమె మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురంలో లాంటి సినిమాలతో టాప్ హీరోయిన్స్ లీగ్ లోకి వెళ్ళిపోయింది.

తర్వాత ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాధే శ్యామ్ ఆచార్య వంటి సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.

సినిమా అవకాశాలు లేకపోయినా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బాగానే డబ్బులు వెనకేసుకుంటోంది.

తాజాగా ఎక్స్ స్టెప్ అనే స్పోర్ట్స్ ఫుట్వేర్ బ్రాండ్ కోసం ఆమె ఒక చిన్నపాటి వీడియో చేసి రిలీజ్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియోలో ఆమె జిమ్ వేర్ లో కనిపించడంతో ఆమె అభిమానులు అందరూ భలే హాట్ గా ఉందే అని కామెంట్ చేస్తున్నారు.