ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.  21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను సొంతం చేసుకొని 100 శాతం రేట్ చూపించింది జనసేన.

ప్రభంజనం సృష్టించిన జనసేన పవన్ కు సినీ సెలబ్రెటీలతో పాటు అటు పలు రాజకీయ పార్టీలు అభినందిస్తున్నాయి. 

తన తండ్రి సాధించిన విజయంపై అకీరా నందన్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.  తాజాగా తన తండ్రి గురించి ఓ స్పెషల్ వీడియోను అకీరా స్వయంగా ఎడిట్ చేయడం విశేషం.

 "ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం.. దారంతా గతుకులు.. చేతిలో దీపం లేదు కానీ.. గుండెల నిండా ధైర్యం అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ స్పీచ్‌తో ఈ వీడియో స్టార్ట్ అవుతుంది. 

ఈ వీడియోలో తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఖుషి, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, పంజా, వకీల్ సాబ్, జల్సా లాంటి సినిమాల నుంచి పవర్‌ఫుల్ సీన్లతో వీడియోని ర్యాంప్ ఆడించేశాడు అకీరా. 

పవన్ కోపంగా చూస్ ఐ సీన్స్‌ను వీడియోలో ఎక్కువగా వాడాడు. దీనికి మైకెల్ జాక్సన్ ఫేమస్ సాంగ్‌ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా పెట్టాడు.

ఒక నిమిషం 30 సెకన్లు ఉన్న ఈ వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ రావాల్సిందే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

వీడియో చూసిన నెటిజన్లు అకీరా ఎడిటింగ్ టాలెంట్‌కి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

"అకీరా నాకు కాల్ చేసి నాన్న గురించి చేసిన ఈ వీడియోను షేర్ చేయమని చెప్పాడు. తన తండ్రి సాధించిన విజయం పట్ల ఎంతో ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాడు అకీరా." అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు రేణూ దేశాయ్.