మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
తాను పదహారేళ్ల వయస్సులో శబరిమల వెళ్లాననీ, విభూతి పెట్టుకొని బడికి వెళ్లేవాడినని అన్నారు.
హిందువుగా గర్వంగా ఉన్నాననీ, అన్ని మాతాలను గౌరవిస్తానని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. మురుగన్ భక్తిపై తన గాఢమైన నమ్మకాన్ని ప్రకటించారు.
మురుగన్ భక్తి మార్గం మనకు శక్తిని ఇస్తుందని తెలిపారు.
మురుగన్‌ను నమ్మితే విజయం నిశ్చితం. ఎదుగుదల సుసాధ్యం. లేచి నిలబడే శక్తి మనకు వస్తుంది.
ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ముస్లిం కూడా గౌరవించవచ్చు. కానీ హిందువు గౌరవిస్తే మాత్రం అభ్యంతరమా? ఇది అసలైన నకిలీ సెక్యులరిజం.