ప్యాకేజీ స్టార్‌ అంటూ తనపై విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ నేతలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజం

నా కొడకల్లారా.. చెప్పు తెగేలా కొడతా అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

చెప్పు తెగేలా రెండు చెంపలు వాయిగొడతానని ఘాటు హెచ్చరికలు చేశారు.

ఇంకోసారి ప్యాకేజీ అంటే దవడ పగిలేలా చెప్పులతో కొడతానని చెప్పు చూపించి మరీ వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ చెప్పుల పై భారీ ఎత్తున సోషల్‌ మీడియాలో, నెటిజన్లలో చర్చ జరుగుతోంది.

పవన్‌ కల్యాణ్‌ వాడుతున్న చెప్పులు ఏ కంపెనీవి, వాటి ధర ఎంత అనే దానిపై ఆయన అభిమానులతోపాటు సాధారణ జనంలోనూ ఆసక్తి ఏర్పడింది.

ఈ క్రమంలో పలువురు పవన్‌ చెప్పులు గురించి పలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్స్‌లో సర్చ్‌ చేస్తున్నారు.

అలాగే పలువురు బయట మార్కెట్లోనూ పవన్‌ కల్యాణ్‌ ధరించిన చెప్పుల కోసం ఆరా తీస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ చెప్పులు బ్రిటన్‌ కంపెనీకి చెందినవని చెబుతున్నారు.

ఫిట్‌ఫ్లాప్‌ అనే సంస్థ తయారుచేసిన చెప్పులను పవన్‌ వాడుతున్నారని తెలుస్తోంది.

వాటి ఖరీదు 63 అమెరికన్‌ డాలర్లుగా ఉందని.. భారత్‌ కరెన్సీలో ఈ చెప్పుల విలువ రూ.6 వేల వరకు ఉందని చెబుతున్నారు.

ఈ చెప్పులను దక్కించుకోవడానికి జనసేన కార్యకర్తలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పోటీపడుతున్నారు.

 దీంతో ఆ.. షాపింగ్‌ వెబ్‌సైట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు మరో అడుగు ముందుకేసి పవన్‌ కల్యాణ్‌ చెప్పల్స్‌ అంటూ అమ్మకాలు సాగిస్తుండటం కొసమెరుపు.

పవన్‌ కల్యాణ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి ఆయా కంపెనీలు పోటీపడుతున్నాయి.