ఈ మధ్యకాలంలో పర్యావరణాన్ని, భూ మాతను రక్షించుకోవడానికి చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ స్ట్రాక్ బదులుగా పేపర్‌వి వాడుతున్నారు.
గతంలో కొబ్బరి బోండం, జ్యూస్, డ్రింక్స్ తాగేప్పుడు గతంలో ప్లాస్టిక్ స్ట్రాలు వాడేవారు, ప్రస్తుతం ఎక్కువమంది పేపర్ స్ట్రాలు వాడటానికే ఇష్టపడుతున్నారు.
పేపర్ స్ట్రాస్‌లో విషపూరితమైన, ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని ఫుడ్ ఎడిటీవ్స్, కాంటామినెంట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది.
వాటిలో 27 బ్రాండ్‌లో విషపూరిత రసాయనాలు గుర్తించారు. పేపర్ స్ట్రాలు నీటిని పీల్చుకోకుండా.. కాగితపు స్ట్రాల్‌లో PFAS గాఢత ఎక్కువగా ఉందని గుర్తించారు.
దాదాపు అన్ని బ్రాండ్‌ల స్ట్రాలలో PFAS లను గుర్తించారు, కానీ ప్రధానంగా మొక్కల ఆధారిత పదార్థాలతో తయారు చేసిన వాటిలో ఇవి ఉన్నాయి.
ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం కావని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని PFAS భూమిలో కలవడాని ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
PFAS వీటిని భూమిని సులభంగా విచ్ఛిన్నం చేయలేదు. ఇవి రోజువారీగా మానవులు ఉపయోగించే ఉత్పత్తులలో ఎక్కువగా PFAS కనిపిస్తున్నాయి.
క్లీనర్‌లు, వస్త్రాలు, తోలు, కాగితం, పెయింట్‌లు, అగ్నిమాపక నురుగులు, వైర్ ఇన్సులేషన్,వాటర్ రెసిస్టెంట్ దుస్తులు, గ్రీస్ రెసిస్టెంట్ పేపర్స్, షాంపూ, డెంటల్ ఫ్లాస్, నెయిల్ పాలిష్, ఐ మేకప్ వంటి ఉత్పత్తులలో PFAS ఎక్కువగా కనిపిస్తాయి.
PFAS గర్భిణీ స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిస్తుందని US ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. శిశువు అభివృద్ధిలో లోపాలకు దారితీస్తుందని స్పష్టం చేసింది.
PFAS ప్రోస్టేట్, మూత్రపిండాలు, వృషణాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.
PFAS పదార్థాలు శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, ఊబకాయానికి దారితీస్తుంది.