పానీపూరి చూస్తే నోరూరుతుంది. ఒక ప్లేట్ పానీపూరి తినాలపిస్తుంది

తెలంగాణలో పానీపూరి డిసీజ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది

పానీపూరి తిన్నవాళ్లు ఎక్కువగా టైఫాయిడ్ జ్వరం బారిన పడుతున్నారు

దీంతో తెలంగాణ ప్రభుత్వం పానీపూరీ డిసీజ్‌పై కీలక ప్రకటన చేసింది.

పానీపూరికి ఉపయోగించే నీళ్లు శుభ్రంగా లేకపోవడం.. పానీపూరి అమ్మే చోట పరిసరాల శుభ్రత లేకపోవడం డిసీజ్‌కు కారణమవుతోంది

రూ.10 పానీపూరి తింటే రూ.10వేలు ఖర్చు పెట్టి ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు

పానీపూరీతో టైఫాయిడ్, కలరా, డయేరియా, కామెర్లు వస్తున్నాయని అంటున్నారు

పానీపూరి తినాలని భావిస్తే ఇంట్లోనే తయారుచేసుకుని తినాలని అధికారులు సూచిస్తున్నారు

పానీపూరిలో వాడే నీటిని కాచి చల్లార్చిన తర్వాతే వాడాలని చెప్తున్నారు