పాన్‌ అనేది కేవలం మౌత్‌ ఫ్రెష్‌నర్‌ మాత్రమే కాదు, ఆరోగ్య సంజీవని కూడా! ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. 

తమలపాకులో విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు, థయమిన్‌, నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, కెరోటిన్‌ వంటివి పుష్కలంగా ఉంటాయి. 

ఈ పాన్ మలబద్ధకాన్ని, గ్యాస్ట్రిక్‌ సమస్యలను నివారిస్తాయి. ఆకు, సున్నం, వక్క కలిపి తీసుకుంటే తోడై ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి దూరమవుతుంది. 

తమలపాకులో రకరకాల దినుసులను దట్టించి పొట్లంలా చుడతారు కాబట్టి, పాన్ అంటారు. ఈ పాన్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి.

కపుల్‌ పాన్‌: మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఇది ఫేమస్. ఈ సెట్‌లో రెండు కిళ్లీలుంటాయి. చేతులతో కాకుండా, పెదాలతో కపుల్స్ ఇచ్చుకుంటారు.

పాన్‌ స్టూడియో: బెంగళూరులోని ఫేజర్‌ టౌన్‌లో మతీన్ బ్రదర్స్ దీన్ని ఏర్పాటు చేశారు. చాక్లెట్‌, కాఫీ, కేసరి, పుదీనా.. ఇలా 100 ఫ్లేవర్డ్‌ పాన్‌లను అందిస్తున్నారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో 600 రకాల పాన్‌లు లభిస్తాయి. గణేష్‌ దుక్రే అనే వ్యక్తి వీటిని తయారు చేస్తాడు. కొన్నింటి ధర లక్షకు పైనే ఉంటాయి.

బెంగళూరులోని కోరమంగళ ఎంపైర్‌ రెస్టారెంట్‌లో ఉన్న పాన్ షాప్‌లో 132 రకాల పాన్‌లు దొరుకుతాయి. స్వీట్‌ పాన్‌ నుంచి ఫైర్‌ పాన్‌ దాకా ఉంటాయి.

ఢిల్లీలోని అమర్‌ కాలనీలో ‘షాన్‌ ఎ పాన్‌’ ఉంది. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు వాడని 51 రకాల పాన్‌లు తయారు చేస్తారు.