OnePlus Nord CE 3 Lite కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. దేశంలో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.19,999 నుంచి Rs 21,999గా కంపెనీ నిర్ణయించింది.

లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 1000 తక్షణ తగ్గింపుతో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో లభిస్తోంది.

అగ్రశ్రేణి స్పెసిఫికేషన్‌లను అందించడంతో పాటు క్రోమాటిక్ (గ్రేయిష్) అనే రెండు రంగులోనూ అందిస్తుంది.

ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌కు బదులుగా అసహి డ్రాగన్‌ట్రైల్ స్టార్ గ్లాస్‌తో ప్యాక్ చేయబడింది.

ఇది Qualcomm Snapdragon 695 5G చిప్‌సెట్‌తో పాటు 8GB వరకు LPDDR4x RAM, 256GB UFS 2.2 స్టోరేజ్‌తో అందించబడింది.

ఈ ఫోన్ లో 5000mAh బ్యాటరీని పొందుపరిచారు. బాక్స్‌లో OnePlus 80W ఛార్జర్‌ను అందిస్తుంది.

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే స్మార్ట్‌ఫోన్ ఒక రోజంతా సులభంగా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.