భార‌త్‌లో ఫిబ్రవ‌రి 10న వ‌న్‌ప్లస్ 11 లాంఛ్ కానుండ‌గా చైనా మార్కెట్‌లో జ‌న‌వ‌రి 4న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.

అఫిషియ‌ల్ లాంఛ్‌కు ముందు వ‌న్‌ప్లస్ 11 డిజైన్, ఫీచ‌ర్లు స‌హా ప‌లు వివ‌రాల‌ను కంపెనీ నిర్ధారించింది.

వ‌న్‌ప్లస్ రిలీజ్ చేసిన అధికారిక ఫొటోల్లో వ‌న్‌ప్లస్ 11 కంప్లీట్ రియ‌ర్ ప్యానెల్ డిజైన్ క‌నిపించింది.

కంపెనీ వెల్లడించిన ఫొటోల్లో ఒక మోడ‌ల్ గ్రీన్ క‌ల‌ర్‌లో క‌నువిందు చేసింది.

మ‌రో మోడ‌ల్ శాండ్‌స్టోన్ ఫినిష్‌తో ఆక‌ట్టుకుంది.

ఫ‌స్ట్‌లుక్‌లో వ‌న్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది.

అల‌ర్ట్ స్లైడ‌ర్‌ను తిరిగి ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్టు ఫ‌స్ట్‌లుక్‌లో వెల్ల‌డైంది.

స‌ర్క్యుల‌ర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన మూడు సెన్స‌ర్ల‌తో వ‌న్‌ప్ల‌స్ 11 క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది.

వ‌న్‌ప్ల‌స్ 11 50 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా, 48 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా.

32 ఎంపీ టెలిఫొటో లెన్స్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని టెక్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఇక ఫ‌స్ట్‌లుక్‌లో సైడ్ కర్వ్స్‌తో స్లీక్ డిజైన్‌తో వ‌న్‌ప్ల‌స్ 11 స్టైలిష్ లుక్‌లో క‌నిపించింది.