మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రావణమాసం శుభాకాంక్షలు, ఈ సందర్భం గా వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకథేంటో తెలుసుకోండి.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసంగా పరిగణిస్తారు.

ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరాలిచ్చే తల్లి వర మహాలక్ష్మీని ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనను కొలుస్తారో.. వారందరి కోరికలను తీర్చే కల్పవల్లి.  వరమహాలక్ష్మీ ఒకరు.

స్కంద పురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించారు. ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించాలని పార్వతీ దేవి కోరగా.. శివయ్య వరలక్ష్మీ వ్రతం మహత్యం గురించి చెప్పాడు.

శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలొస్తాయని వివరించాడు.

 ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెబుతాడు నందీశ్వరుడు. 

చారుమతి తన భర్త పట్ల ఎంతో ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది

ఆ మహా పతివ్రత పట్ల వరమహాలక్ష్మీ కలలో కనిపించి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారికి కోరిన కోరికలన్నీ తీరుస్తానని అభయమిస్తుంది.