మేడిపండు చూడు మేలిమై ఉండును. పొట్ట విప్పి చూడు. పురుగులు ఉండును అన్న పద్యం అందరికి తెలిసిందే.

అలాగే వంటింట్లో కనిపించే నాన్స్టిక్ పాన్ లు చూడటానికి అందంగా కనిపించినా.. ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుత బిజీ జీవనంలో తొందరగా వంట కావాలనో, నూనె ఎక్కువ పీల్చదనో కొంతమంది నాన్స్టిక్ పాన్ లో వంట చేస్తున్నారు. 

వీటిపై టెఫ్లాన్ అనే రసాయన పదార్ధం ఉంటుంది. అందుకే ఇవి వంట చేస్తే అడుగున అంటకుండా ఉంటుంది. 

అంటినా శుభ్రం చేయటం ఈజీగా ఉండటంతో వీటి వినియోగం కామన్ గా మారిపోయింది. 

నాన్ స్టిక్ పాన్లు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే, వాటిపై ఉండే టెఫ్లాన్ అనే రసాయనం రోజూ కొద్దిమొత్తంలో కరుగుతూ ఉంటుంది.

వండే ఆహారపదార్ధాలలో కలిసి, మనకు తీవ్రమైన తలనొప్పి, థైరాయిడ్ రుగ్మతలు, మూత్రపిండ, కాలేయ సమస్యలు వస్తున్నాయని వైద్యులు ధృవీకరించారు.

అందుకే నాన్‌ స్టిక్‌ వాడకం కాస్త తగ్గించాలని అంటున్నారు నిపుణులు