గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా?.. ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఈ నిబంధనలు పాటించకుంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. 

ఇకపై బీచ్‌లో డ్రైవింగ్‌ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం.

బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం.

 టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయి. 

 వాటర్‌ స్పోర్ట్స్‌ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. 

టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. 

తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యాటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. 

ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు.

నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు.