ప్రీతి ముకుందన్ తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

చెన్నైలో డాక్టర్ తల్లితండ్రులకు జూలై 30,2001న జన్మించిన ప్రీతి తమిళనాడులోని తిరుచ్చిలో పెరిగారు.

సినిమాల్లో ఎంట్రీ కోసమే ప్రీతి చెన్నైకి మకాం మార్చారు.

ప్రీతి ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచీ(NIT-T) నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో B Tech పట్టా పొందారు.

ప్రీతి 5 సంవత్సరాల వయస్సు నుండి భరతనాట్య నృత్యకారిణి.

క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు, ఆమె హిప్హాప్, సినీ జానపద, పాశ్చాత్య, డ్యాన్స్ లలో నిష్ణాతులు.

NIT-త్రిచీ డ్యాన్స్-ట్రూప్‌లో ఇంటర్‌కాలేజి సాంస్కృతిక కార్యక్రమాలలో అనేక బహుమతులను గెలుచుకుంది.

ఆమె 2018 సంవత్సరంలో కళాశాల మొదటి సంవత్సరంలో మోడలింగ్‌లో అడుగుపెట్టింది.

నాలుగు సంవత్సరాల పాటు ప్రీతి వందకు పైగా టీవీ వాణిజ్య ప్రకటనలు మరియు ప్రింట్ యాడ్స్‌లో నటించారు.

ఇక తమిళంలో స్టార్, తెలుగులో ఓమ్ భీం బుష్ సినిమాల్లో నటించిన ఆమె కన్నప్పలో కూడా నటిస్తోంది.