ఆరోగ్యంగా ఉండటానికి రోజూ తాజా పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
కానీ కొన్ని రకాల పండ్లను రాత్రి పూట తింటే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నిమ్మ, నారింజ లేదా బత్తాయి వంటి పండ్లలో ఆమ్లాలుంటాయి. రాత్రుళ్లు వీటిని తింటే గుండెల్లో మంట పుడుతుంది.
పైనాపిల్‌లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాత్రి తినడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి.
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి తింటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.
మామిడి పండ్లను రాత్రి తింటే చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
అరటి : వీటిల్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. పగలు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్షలో సహజ సిద్ధంగా చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటిని కూడా రాత్రిళ్లు తినొద్దు.
కివీలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు తినడం వల్ల జీర్ణ క్రియకు ఆటంకం కలుగుతుంది.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుంది.
చెర్రీ పండ్లలో కూడా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కూడా రాత్రి పూట తినొద్దు.