లక్ష్మీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నయనతార

హిట్ల మీద హిట్లు అందుకొని ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా  కొనసాగుతోంది

సినిమాల విషయంలో ఎలా ఉన్నారిలేషన్ విషయంలో మాత్రం నయన్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంది

నయన్ తన జీవితంలో ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రేమలో పడింది

అందులో మూడు విఫలమవ్వగా నాలుగోది పెళ్లిపీటలు వరకు వచ్చింది

మొదటిది.. శింబుతో  ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలోనే నయన్- శింబుతో డీప్ లవ్ లో పడింది

ఆ ప్రేమ ఎంత డీప్ అంటే వారు కిస్ చేసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడిపోయి షాక్ ఇచ్చింది

శింబు తరువాత నయన్ ను పడేసింది కొరియోగ్రాఫర్ ప్రభుదేవా

అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న ప్రభుదేవా కోసం నయన్ చేసిన సాహసం అంతా ఇంతా కాదు

మతం మార్చుకుంది, ఒంటిపై ప్రభుదేవా టాటూ వేయించుకుంది.. అతడి భార్యతో పోరాటానికి కూడా దిగింది

పెళ్లి వరకు వచ్చిన ఈ జంట ప్రేమ ప్రభుదేవా భార్య వలన పటాపంచలయ్యింది

ప్రభుదేవా రిలేషన్ తరువాత నయన్ చాలా కుంగిపోయింది.. సినిమాలు కూడా ఆపేసింది.. తరువాత కొన్నిరోజులు ఆర్య ప్రేమలో పడింది

ఒక అవార్డు ఫంక్షన్ లో ఈ జంట తమ ప్రేమను వ్యక్తపరిచనట్లు కోలీవుడ్ లో టాక్.. ఆ తరువాత ఏమైందో ఒకరికొకరు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి

ఇక అన్నీ దాటుకొని తన ఆనంద మజిలీకి చేరుకొంది నయన్.. విగ్నేష్ శివన్ ను వివాహమాడి..

ఇక ఇటీవలే ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చారు.. ఈ జంట హ్యాపీగా ఉండాలని కోరుకుందాం