మే కప్ అంటే ఇష్టపడని ఆడవారు ఉండరు.

ఫంక్షన్లు, పెళ్లిళ్లకి ఏ సందర్భంలోనైనా మేకప్ వేసుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తారు. అంతే టైం ఆ మేకప్ ను తీసివేయడానికి కష్టపడతారు.

కొంతమంది మేకప్ ను తొలగించడానికి చర్మంపై గట్టిగా రుద్దుతారు. అలాగే వెంటనే నీటితో కడిగి వేస్తారు.

ఇలా చేస్తే.. చర్మం డ్యామేజ్ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మం నష్ట పోకుండా ఉండాలంటే.. మార్కెట్లో దొరికే మేకప్ రిమూవర్ను కాటన్ కాటన్ ప్యాడ్ పై వేసి ముఖానికి అప్లై చేయాలి.

ఒక నిముషం తర్వాత ఆ కాటన్ తో రిమూవ్ చేసుకుని, తర్వాత మళ్లీ కాటన్పై కొబ్బరినూనె వేసి, దానితో మరల ముఖాన్ని మృదువుగా శుభ్రం చేసుకోవాలి.

ఇలా తొలగించాక.. చివరిగా ముఖాన్ని శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోవాలి.

మేకప్ రిమూవర్ తోనే కాకుండా డైరెక్ట్ గా కొబ్బరినూనెతో కూడా మేకప్ ను తొలగించుకోవచ్చు.