ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కొన్ని సహజమైన విధానాలు బరువును తగ్గించుకోవడం, ఆహారంలో మార్పులు లాంటి వాటిని పాటించాలి.

ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కోసం కొన్ని ఇంటి నివారణ చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆర్థరైటిస్ చికిత్సకు నువ్వులు, కపికాచు గింజలను సమాన భాగాలుగా అశ్వగంధ పొడితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే, ఆర్థరైటిస్‌తో సహా ఇతర పరిస్థితులకు సహాయపడుతుంది. 

అల్లం అనేక రకాల సూప్‌లు, సలాడ్‌లు, సాస్‌లలో ఉపయోగించవచ్చు. ఆర్ధరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు అల్లంను వివిధ రూపాల్లో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆర్థరైటిస్‌కు ఔషధంగా కలబందను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా జీర్ణశయాంతర సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

పసుపులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పిని తొలగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పాలని మరిగించి ఆ పాలల్లో పంచదార తో పాటు ఒక చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు. 

యూకలిప్టస్ వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలగటంతోపాటు ఆర్థరైటిస్ నొప్పిని పోగొట్టడంలో వీటి ఆకులు బాగా పని చేస్తాయి. 

గ్రీన్ టీ బరువు తగ్గడానికే కాకుండా ఆర్ధరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి.