అందమైన ముఖ సౌందర్యం కోసం ఏడు సహజ చిట్కాలు
నిమ్మరసంలో ఒక స్పూన్ పాలు, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి తరచూ రాసుకుంటే.. ఫెయిర్ & మచ్చలేని చర్మం మీ సొంతం
ఓట్ మీల్‌ను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేయాలి. అందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రాసుకుంటే.. మంచి ఫలితం పొందవచ్చు
ఒక బంగాళాదుంప తీసుకొని, దానిని చూర్ణం చేసి, దాన్నుంచి రసాన్ని పిండి, ముఖానికి వర్తించాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా చేయాలి
ఉడికించిన అరటిపండుని మెత్తగా చేసుకొని, అందులో ఒక స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి, 20 నిమిషాలు ఉంచాలి
ఒక స్పూన్ శెనగ పిండి, ఒక టీస్పూన్ పసుపును పాలు లేదా నీటితో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచాలి
అర కప్పు బొప్పాయిని మాష్ చేసి, ఒక స్పూన్ తేనెతో కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచాలి
పెరుగులో తాజా టమోటాలను పిండి, మిశ్రమంగా కలపాలి. దీనిని ముఖాన్ని అప్లే చేసి, కాసేపయ్యాక కడగాలి. ఇలా చేస్తే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు