బ్లాక్ టీ హెయిర్ మాస్క్: తలస్నానం చేసిన తర్వాత తలారా బ్లాక్ టీ వాటర్ పోసుకోవాలి, ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
బాదం నూనె: బాదం నూనెను గోరువెచ్చగా వేడి చేసి, తలకు అప్లై చేసి, బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే, తెల్లజుట్టు నుంచి ఉపశమనం లభిస్తుంది.
బంగాళదుంప: ఒక బంగాళదుంపను ఉడికించి, ఆ నీటితో జుట్టును శుభ్రం చేయాలి. అనంతరం కొద్దిగా పెరుగు తలకు పట్టించి, 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.
బ్లాక్ కాఫీ: జుట్టు మూలాల నుండి వెంట్రుకల పొడవునా బ్లాక్ కాఫీని అప్లై చేయాలి. ఈ చిట్కాతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. కొంచెం సమయం పట్టినా, ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
ఉసిరికాయ: ఉసిరియాను నీటిలో ఉడికించి, వాటిని మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని నేరుగా జుట్టుకు అప్లై చేయాలి. ఈ రెమెడీని నెలలో మూడు సార్లు చేయాలి.
కరివేపాకు & కొబ్బరి నూనె: ఈ మాయిశ్చరైజింగ్ ట్రీట్‌మెంట్ ఉపయోగించిన తర్వాత తలకు మసాజ్ చేస్తే.. జుట్టును నల్లగా మారుస్తుంది.
ఉల్లిపాయ & నిమ్మరసం: ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇందులో ఉన్న పోషకాలు.. జుట్టును నల్లగా మార్చి, అందంగా తయారుచేస్తాయి.
హెన్నా & గుడ్డు: ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, కాసేపు వదిలేసి, తలస్నానం చేయాలి. ఇది నెరిసిన జుట్టును త్వరగా నల్లగా మారుస్తుంది.