ప్రస్తుతం గురక అనేది చాలా సాధారమైపోయింది. గురక పెట్టడం వల్ల పక్కన నిద్రించే వారు ఇబ్బంది పడతారు.

గొంతులోని కండరాలు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు వైబ్రేట్ అయినప్పుడు శబ్దం వచ్చి గురక మొదలవుతుంది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల గురకపెట్టడాన్ని తగ్గించవచ్చు.

 ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసక్రియపై పట్టు పెరుగుతుంది. కాబట్టి ప్రాణాయామం నేర్చుకోవడం మంచిది. ఈ యోగా ప్రక్రియ వల్ల ఊపితిత్తులకు సరిపడా ఆక్సిజన్ అందుతుంది. 

గొంతు, నాలుకలోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా గురకను అడ్డుకోవచ్చు. గొంతు, నాలుకకు సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా అవి బలపడతాయి. 

అధిక బరువు ఉండటం కూడా గురకకు కారణం అవుతుంది. ఊబకాయుల్లో గొంతులోని అధిక కణాల కారణంగా నిద్రించేటప్పుడు శబ్దం వస్తుంది. 

గురక పెట్టడానికి పొగ తాగే అలవాటు కూడా కారణమవుతుంది. ఈ అలవాటును మానుకుంటే మంచిది. 

నిద్రించే సమయంలో తలగడ ఉంచుకోవడం వల్ల కూడా గురక సమస్య కొంత వరకు తగ్గుతుంది. దిండు మరీ ఎత్తుగా లేదా మరీ పలుచగా ఉండకుండా చూసుకోవాలి.

నిద్రించే ముందు ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్ కారణంగా గొంతులోని కణాలు రిలాక్స్‌గా మారి నాలుక వెనక్కి వెళ్తుంది. ఫలితంగా గురక వస్తుంది.

రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో రెండు చెంచాల పసుపు కలుపుకొని తాగడం వల్ల గురక సమస్య దూరం అవుతుంది.

గోరు వెచ్చగా చేసిన వడగట్టిన నెయ్యిని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేయడం వల్ల గురక తగ్గడంతోపాటు నిద్ర బాగా పడుతుంది. 

 ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బ్రాహ్మి తైలం కూడా వాడొచ్చు. ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల చొప్పున వేసుకోవాలి.