మునగ ఆకుతో మనం ఎన్నో వంటలు చేసుకుని తిని ఆస్వాదిస్తాం
వీటితో ఎన్ని ప్రయోజనాలో అందరికీ తెలిసిందే.
ఆహారం గురించి. కాకుండా మునగ ప్రొడక్ట్స్ మన శరీరానికి ఎన్ని లాభాలో జెస్ట్ రీడ్..
మునగ ఆకును ఎండబెట్టి పొడి చేసుకుని, రెండు చెంచాల పొడిని తీసుకుని దానిలో సరిపడా రోజ్ వాటర్, తేనె, తగినన్ని వాటర్ కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి
10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసి చూడండి మీ ముఖం చూసి మీతో పాటు మీ వాళ్లందరూ ఆశ్చర్యపోతారు.
వారంలో ఇలా రెండు, మూడు సార్లు చేస్తే మీ సౌందర్యానికి తిరుగే ఉండదు.
మునగాకులో విటమిన్ A కాల్షియం పుష్కలంగా ఉండటంతో చర్మ సంబంధిత సమస్యలు, మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా, మళ్లీ రాకుండా చేయవచ్చు.
మునగాకు పొడిని తరచూ వాడితే యవ్వనంగా కనిపిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి