ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది.
ఒత్తిడి వల్ల లైంగిక కోరికలు తగ్గిపోవడంతో పాటు హార్మోన్ మార్పులు, లిబిడోలో మార్పులు ఏర్పడుతాయి.
స్ట్రెస్ వల్ల నిరంతరం తలనొప్పి, వెన్నునొప్పి వంటివి ఏర్పడుతాయి. మైగ్రేన్ వంటివి ఎటాక్ అవుతాయి.
అధిక ఒత్తిడి కారణంగా మొటిమలు ఏర్పడుతాయి.
ఒత్తిడి వల్ల జీర్ణసమస్యలు ఏర్పడుతాయి. జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి.
తరుచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. మీ రోగనిరోధక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది.
మానసిక ఒత్తిడి నిద్రలేమికి కారణం అవుతుంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టదు.
అధికంగా చెమటలు పట్టడం కూడా ఒత్తడికి లక్షణం ఒత్తిడిలో ఉన్నప్పుడు అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీంతో శ్వేదగ్రంధులు చెమటను ఎక్కువగా విడుదల చేస్తాయి.