ముందుగా ఒక కప్పులో గుడ్డులోని తెల్లసొనను తీసుకోవాలి, అందులో రెండు చెంచాల మామిడి గుజ్జు కలపాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, ఆరేంతవరకూ ఉంచుకోవాలి

అనంతరం చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి

ఇలా వారానికి మూడు సార్లు చేస్తే, ముఖంపై ముడతలు పోతాయి

ఈ మిశ్రమం రాసి కడిగితే, ముఖంపై రక్త ప్రసరణ బాగా జరిగి, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి

ఈ మిశ్రమంలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలోనూ తోడ్పడుతాయి