స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ, వీర్యం కదిలే సామర్థ్యం పురుషుల సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి.
స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా అవసరం.
వ్యాయామం
సంతానోత్పత్తి, లైంగిక పనితీరును ప్రభావితం చేస్తుంది. లిబిడోను మెరుగుపరుస్తుంది. మెదడుకు అనుభూతిని ఇచ్చే న్యూరో కెమికల్స్ విడుదల అవుతాయి.
ఊబకాయం..
ఊబకాయం టెస్టోస్టిరాన్ పడిపోవడానికి కారణం అవుతుంది. ఊబకాయం రాకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
నిద్ర
తగినంత నిద్ర ఉన్నప్పుడే శరీరంలో సరైన పరిమాణంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. సరైన నిద్ర కూడా స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
విటమిన్-డి
స్పెర్మ్ కౌంట్‌కు విటమిన్ డి అవసరం. తగినంత ఎండ శరీరానికి తగలాలి. డీ విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
సమతుల్య ఆహారం
ప్రొటీన్లు, కార్బోహైడ్రెట్స్, కొవ్వులు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
తాజా పండ్లు, కూరగాయాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
స్మోకింక్, ఆల్కాహాల్ డ్రింకింగ్ మానేయాలి.