2023 జనవరి 22కి నమ్రత 51 ఏట అడుగుపెట్టారు. కానీ ఆమె లుక్ మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది.

స్లిమ్ అండ్ గ్లామర్ లుక్ లో మనసులు దోచేస్తున్నారు. ఐదు పదుల వయసులో ఇలా కనిపించడం మాములు విషయం కాదు. 

నమ్రత విషయంలో ఏజ్ రివర్స్ అవుతుందేమో అనిపిస్తుంది. లేక అమృతం తాగుతూ ఈ యవ్వనం మైంటైన్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

మహేష్ -నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే  సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది. అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది. 

17 ఏళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవపడ్డారన్న వార్త వినలేదు.ఆ గొప్పతనం అంతా నమ్రతదే. 

ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం, ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం. 

మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తింది. పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సంప్రదాయంగా నమ్రత ఉంటారు. 

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు. ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు.

మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ ఎండార్స్మెంట్, వ్యాపారాలు, సినిమా డేట్స్ నమ్రతనే చూసుకుంటారు.

వంశీ సినిమా షూటింగ్ లో నమ్రత-మహేష్ మధ్య ప్రేమ చిగురించింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రతల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. 

ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు. మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం. 

తాజాగా రెడ్ చుడిదార్ ధరించి రాయల్ లుక్ లో కట్టిపడేశారు. నమ్రత అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇంత అందగత్తె కాబట్టే మహేష్ మనసు దోచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.