ఎక్సర్సైజ్ లేకుండానే చాలా సింపుల్‌గా పొట్టను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..?
ప్రతి రోజూ నిద్రపోయే ముందు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే నిద్రలేవగానే పరగడుపుతో మరో రెండు నమిలి మింగాలి.
ఉదయం వెల్లుల్లి రెబ్బలను తిన్న తర్వాత గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. చక్కెరకు బదులు తేనె వాడితే చాలా మంచిది.
భోజనం నుంచి అన్నాన్ని తగ్గించండి. దానికి బదులు రెడ్ రైస్, గోధుమ బ్రెడ్, ఓట్స్ బ్రెడ్‌తో భోజనం చేయండి.
వంటల్లో దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలు, పచ్చి మిర్చి ఉండేలా చూసుకోండి.
చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్‌తో పాటు అన్ని రకాల స్వీట్లను 7 రోజుల పాటు అస్సలు తినకండి.
ఏడు రోజుల పాటు ఎలాంటి మాంసాహారం ముట్టకూడదు.
ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తింటే మంచిది.
మంచి నీటిని ఎక్కువగా తాగాలి. నీటిని ఎక్కువగా తాగితే మెటబాలిజం రేటు పెరుగుతుంది.