కాలేయం మన శరీరవ్యవస్థలో అనేక జీవక్రియలకు తోడ్పడుతుంది.
శరీరంలోని విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లేలా చేస్తుంది.
దీర్ఘకాలికంగా ఆల్కహాల్ అలవాట్లు, కొన్ని వైరస్ వ్యాధులు కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
కాలేయం దెబ్బతినే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అశ్రద్ధ చేయకూడదు.
కాలేయం సరిగ్గా పని చేయని సమయంలో గాయాలు ఏర్పడితే రక్తస్త్రావం ఏక్కువగా ఉంటుంది.
కాళ్లలో ద్రవం చేరడం వల్ల పాదాల వాపు కనిపిస్తుంది.
జాండీస్, చర్మం దురద ఎక్కువగా ఉంటుంది. కాలేయ వ్యాధికి ఇవి ముఖ్య లక్షణాలు.
శరీరంలో బిలురుబిన్ పెరుగుతుంది. తగినంత నిద్ర ఉండదు.
రక్తం వాంతులు, మోషన్ తెలుపు రంగులో రావడాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.
అరచేతుల దురదలు, మంట వంటి లక్షణాలు ఉంటాయి.